కోహ్లీ తన నంబర్ 3స్థానాన్ని నిలబెట్టుకుంటాడు,కానీ అప్పుడే *Cricket | Telugu OneIndia

2022-08-05 12

Virat Kohli will remain in his original No.3 place in the team During T20 World cup 2022 times, hopes Wasim Jaffer | అక్టోబరు-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ తన నంబర్ 3స్థానాన్ని నిలబెట్టుకుంటాడని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ చేయలేదనే అపవాదును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం కోహ్లీ పేలవ ఫాంలో ఉన్నాడు. వెస్టిండీస్ పర్యటనతో పాటు జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అతనికి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రెస్ట్ ఇచ్చింది. ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అతను ప్రభావం చూపలేకపోయాడు. టీ20ప్రపంచకప్‌కు కోహ్లీ ఎంపికపై పలువురు ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. అయినప్పటికీ టీమిండియా నంబర్ 3బ్యాటింగ్ లైనప్‌లో కోహ్లీ ఉంటాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు.

#viratkohli
#teamindia
#WasimJaffer